Home  »  TV News  »  రిషి, వసు కలిశారంటూ మురిసిపోయిన జగతి

Updated : Jun 28, 2022


వసు, రిషి ఇద్దరూ పుచ్చకాయ ముక్కలు తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో వైపు జగతి, మహేంద్ర ఎదురెదురుగా కూర్చుని ఆలోచిస్తుంటారు. ఇంతలో జగతి తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. అదేదో నాకూ చెప్తే నవ్వుతానుగా అంటాడు మహేంద్ర. రిషి, వసు దగ్గరవుతున్నారు అంటుంది జగతి. అంత ఫీల్ అవ్వకు.. రిషి ఏ విషయం అంత తొందరగా మర్చిపోడు నీ విషయంలోనే చూసావుగా చిన్నప్పటినుంచి ఇప్పటివరకు నీ మీద అదే కోపం. ఏమన్నా తగ్గిందా అంటాడు. జగతి ఎమోషనల్ అయ్యి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. 

ఇక మహేంద్ర జగతికి  సర్ది చెప్పబోతాడు. వసు లవ్ లెటర్ చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంకో పక్క రిషి తనదగ్గరకు వసు వచ్చినట్టు ఫీల్ అవుతాడు. తర్వాత వాళ్ళ మధ్య జరిగిన విషయం తెలిసి బాధపడతాడు. ఇక తాను స్కాలర్ షాప్ టెస్ట్ లో టాప్ లో ఉందని తెలిసి కంగ్రాట్స్ చెప్తాడు రిషి. మీరు ఆరోజు నాకు ఎంతో అండగా ఉన్నారు కాబట్టే అని అనేసరికి జరిగింది తలుచుకుని రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మినిస్టర్ గారు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారని జగతి మహేంద్రకు చెప్తుంది. 

వసు మంచి మార్కులు సాధించినందుకు ఒక సోషల్ ఎవెర్ నెస్ ప్రోగ్రాం చేయమని కూడా చెప్పారంటుంది జగతి. ఇక రిషి, వసు  తాము కొలిచే అమ్మవారి దగ్గరకు వెళ్లి ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్లి  వాళ్ళ పేర్లు రాసి కాపాడు తల్లి అంటూ ప్రార్థిస్తారు. మిగతా ఎపిసోడ్ హైలైట్స్ కోసం స్టార్ మాలో సాయంత్రం ప్రసారమయ్యే గుప్పెడంత మనసు లో చూడొచ్చు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.